సిద్ధరామయ్య నియంత: యడ్యూరప్ప | Siddaramaiah governing like a dictator: BS Yeddyurappa | Sakshi
Sakshi News home page

సిద్ధరామయ్య నియంత: యడ్యూరప్ప

Nov 27 2013 2:57 PM | Updated on Sep 2 2017 1:02 AM

సిద్ధరామయ్య నియంత: యడ్యూరప్ప

సిద్ధరామయ్య నియంత: యడ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మాజీ సీఎం, కేజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బెల్గాం: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మాజీ సీఎం, కేజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్ధరామయ్య నియంత అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఆయన నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. ఒంటెత్తు పోకడతో వ్యహరిస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యేలు, మంత్రులను అభిప్రాయాలు తెలుసుకోకుండానే పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. సొంత పార్టీని కూడా సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. షాదీ భాగ్య యోజన లాంటి పథకాలు ఇలాగే ప్రవేశపెట్టారని ఆరోపించారు. షాదీ భాగ్య యోజన పథకాన్ని అన్ని వర్గాలకు విస్తరించాలంటూ బెల్గాంలోని సువర్ణ సౌధలో వరుసగా రెండో రోజూ యడ్యూరప్ప ఆందోళన కొనసాగించారు.

Advertisement
 
Advertisement
Advertisement