వారు విషం చిమ్ముతున్నారు: సోనియాగాంధీ | Narendra Modi, BJP 'spreading poison': Sonia Gandhi | Sakshi
Sakshi News home page

వారు విషం చిమ్ముతున్నారు: సోనియాగాంధీ

Nov 25 2013 1:35 AM | Updated on Aug 15 2018 2:14 PM

వారు విషం చిమ్ముతున్నారు: సోనియాగాంధీ - Sakshi

వారు విషం చిమ్ముతున్నారు: సోనియాగాంధీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన ప్రచారానికి మరింత పదునుపెట్టారు.

మోడీ, బీజేపీలపై సోనియా ధ్వజం
వారు కళ్లు మూసుకున్నారు, అభివృద్ధి కనపడదు
అభివృద్ధి ప్రత్యక్షంగా కనిపిస్తోంటే... ఇక రుజువులెందుకు
విమర్శించడమే వారి పని

 
 న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన ప్రచారానికి మరింత పదునుపెట్టారు. బీజేపీపైనా, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపైనా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సంకుచిత సిద్ధాం తంతో వారు విషాన్ని చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆమె ప్రసంగించారు. దేశంలోని అన్ని చిన్న రాష్ట్రాలకంటే ఢిల్లీ అభివృద్ధిలో వెనుకబడి ఉందన్న మోడీ వ్యాఖ్యలను సోనియా తిప్పికొట్టారు. వారు కళ్లు మూసుకున్నారని, అబద్ధాలే మాట్లాడాలని కంకణం కట్టుకున్నారని ఆమె విమర్శించారు. గత 15 ఏళ్లలో తమ పార్టీ పాలనలో ఢిల్లీ ఎంతగానో అభివృద్ధి చెందిందంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను కొనియాడారు. రాజధాని నగరం ప్రగతిపథంలో వెళ్తున్నా విపక్షానికి కనిపించకపోవడం విడ్డూరమన్నారు. ఆమె మోడీ పేరునుగానీ, బీజేపీ పేరునుగానీ ప్రస్తావించకుండా పరోక్షంగా తమ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని మాట్లాడారు.
 
  12 నిమిషాలపాటు హిందీలో కొనసాగిన సోనియా ప్రసంగం వ్యంగ్యాస్త్రాలు, సూక్తులతో ఎంతగానో ఆకట్టుకుంది. ‘నేను కూడా ఢిల్లీవాసినే. ఢిల్లీలో గత 15 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి మనమంతా సాక్షులుగా ఉన్నాం. కళ్లెదురుగా కనిపిస్తున్న దానికి రుజువులు అక్కర్లేదు అనే ఒక సూక్తి ఉంది. అయితే కొంతమంది కావాలనే కళ్లు మూసుకొని అబద్ధాలు మాట్లాడేందుకు కంకణబద్దుల య్యారు’ అని బీజేపీపై మండిపడ్డారు. షీలా అభివృద్ధిలో ఢిల్లీని మోడల్‌గా తీర్చిదిద్దారని సోనియా కితాబునిచ్చా రు. అయితే ప్రతిపక్షం దీన్ని విస్మరించి మాట్లాడుతోందని దుయ్యబట్టారు. గతవారం ఢిల్లీలోని దక్షిణ్‌పురిలో రాహుల్ గాంధీ పాల్గొన్న సభలో జనం మధ్యలోనే లేచివెళ్లపోవడంతో అభాసుపాలైన కాం గ్రెస్ అలాంటి ఘటన పునరావృ తం కాకుండా జాగ్రత్తలు తీసుకుం ది. దీంతో ఆదివారం నాటి సోని యా సభ జనంతో కళకళలాడింది.

Advertisement
 
Advertisement
Advertisement