మళ్లీ తడబడ్డ మంత్రి నారా లోకేశ్‌ | nara lokesh tongue slip again in PV birth anniversary | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి పీవీ ప్రధాని అయ్యారు: లోకేశ్‌

Jun 28 2017 1:04 PM | Updated on Mar 18 2019 9:02 PM

మళ్లీ తడబడ్డ మంత్రి నారా లోకేశ్‌ - Sakshi

మళ్లీ తడబడ్డ మంత్రి నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అలవాటులో పొరపాటుగా మరోసారి టంగ్‌ స్లిప్‌ అయ్యారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అలవాటులో పొరపాటుగా మరోసారి టంగ్‌ స్లిప్‌ అయ్యారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా బుధవారం లోకేశ్‌ నోరు జారారు. తెలుగు దేశం పార్టీ నుంచి పీవీ ప్రధానమంత్రి అయ్యారంటూ వ్యాఖ్యానించారు. అయితే పొరపాటు గ్రహించిన ఆయన అనంతరం తప్పు సవరించుకున్నారు.

తెలుగు ప్రజల నుంచి పీవీ నర్సింహారావు ప్రధాని అయ్యారంటూ కవరింగ్‌ ఇచ్చుకున్నారు. కాగా గతంలోనూ అనేకసార్లు నారా లోకేశ్‌ తన వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డారు కూడా. గతంలోనూ అంబేడ్కర్‌ జయంతిని వర్థంతిగా పేర్కొనడమే కాకుండా, శుభాకాంక్షలు కూడా చెప్పి నవ్వులపాలైన విషయం తెలిసిందే.  అయితే ఈసారి ఇంకొంచెం ముందుకెళ్లిన నారా లోకేశ్‌ .....మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేతను తమ పార్టీ నుంచి ప్రధాని అయ్యారని వ్యాఖ్యలు చేసి మళ్లీ అభాసుపాలు అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement