మైనర్పై అత్యాచారం:నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష | Man sentenced to 7 years RI for raping minor girl | Sakshi
Sakshi News home page

మైనర్పై అత్యాచారం:నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష

Dec 14 2013 12:04 PM | Updated on Jul 28 2018 8:35 PM

తమిళనాడు ఈరోడ్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు మురుగేశన్కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రిన్సిఫల్ జడ్జి సతీష్ కుమార్ శుక్రవారం తీర్పు వెలువరించారు.

తమిళనాడు ఈరోడ్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు మురుగేశన్కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రిన్సిఫల్ జడ్జి సతీష్ కుమార్ శుక్రవారం తీర్పు వెలువరించారు. దానితోపాటు రూ.10 వేల జరిమాన కూడా విధించారు. గతేడాది మార్చిలో మైనర్పై ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో మురుగేశన్ అత్యాచారం చేశారు.

 

దాంతో ఆ బాలిక తన తల్లితండ్రులకు విషయాన్ని తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు కేసు నమోదు చేసి, పరారిలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితుడికి జైలు శిక్ష విధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement