మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ | Indian, Pakistani armies clash in Kashmir | Sakshi
Sakshi News home page

మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్

Oct 7 2014 10:13 PM | Updated on Sep 2 2017 2:29 PM

పొరుగుదేశం పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది.

జమ్మూ:పొరుగుదేశం పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. నిన్న అర్నియా పట్టణంలో ఐదుగురు భారత పౌరులను బలిగొన్న పాక్ దళాలు మంగళవారం కూడా జమ్మూ సెక్టార్, పూంచ్ జిల్లాలోని వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత సరిహద్ద సైనిక శిబిరాలపై కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లు సహా తొమ్మిది మంది  గాయపడ్డారు. అర్నియా పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన బాంబు దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి.

 

పాక్ కాల్పులను భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి.  ప్రతిష్టంభన తొలగించడానికి ఇరు దేశాల సైనిక ఆపరేషన్ల డెరైక్టరేట్ జనరల్ అధికారులు హాట్‌లైన్‌లో మాట్లాడుకున్నా ఫలితం లేకపోయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement