భారత్ బాధ్యతాయుతంగా ఉండాలి:పాకిస్తాన్ | 'India must act responsibly along the LoC' | Sakshi
Sakshi News home page

భారత్ బాధ్యతాయుతంగా ఉండాలి:పాకిస్తాన్

Oct 9 2014 9:35 PM | Updated on Sep 2 2017 2:35 PM

భారత్ బాధ్యతాయుతంగా ఉండాలి:పాకిస్తాన్

భారత్ బాధ్యతాయుతంగా ఉండాలి:పాకిస్తాన్

భారత్‌వైపు నుంచి జరిగే ఎలాంటి దురాక్రమణను అయినా ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్‌కు ఉందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ గురువారం స్పష్టం చేశారు.

ఇస్లామాబాద్: భారత్‌వైపు నుంచి జరిగే ఎలాంటి దురాక్రమణను అయినా ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్‌కు ఉందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ గురువారం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సరిహద్దు ఉద్రిక్తతలు రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణకు దారితీయకూడదని తాము కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఖ్వాజా సూచించారు.

 

‘ఇలాగే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే.. తట్టుకోలేని స్థాయిలో ప్రతిస్పందన ఉంటుంద’న్న భారత రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యల అనంతరం ఖ్వాజా పై విధంగా స్పందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement