పెళ్లి బస్సుపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు | High-tension wire falls on bus in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

పెళ్లి బస్సుపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు

Apr 19 2014 8:32 AM | Updated on Oct 8 2018 3:17 PM

మధ్యప్రదేశ్ బిండి జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై విద్యుతు హై టెన్షన్ వైర్లు పడ్డాయి.

మధ్యప్రదేశ్ బిండి జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై విద్యుతు హై టెన్షన్ వైర్లు పడ్డాయి. ఆ ఘటనలో ఐదుగురు మరణించగా, మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది బస్సులో ఉన్నారని ఐజీ డి.సి. సాగర్ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement