కృష్ణా జిల్లాలోకి గోదావరి నీరు | Godavari water to Krishna district | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలోకి గోదావరి నీరు

Sep 10 2015 1:04 AM | Updated on Sep 3 2017 9:04 AM

కృష్ణా జిల్లాలోకి గోదావరి నీరు

కృష్ణా జిల్లాలోకి గోదావరి నీరు

పోలవరం కుడికాలువ ద్వారా గోదావరి జలాలను నూజివీడు మండలం పల్లెర్లమూడి వద్ద కృష్ణా జిల్లాలోకి రాష్ట్ర జలవనరుల శాఖ

నూజివీడు: పోలవరం కుడికాలువ ద్వారా గోదావరి జలాలను నూజివీడు మండలం పల్లెర్లమూడి వద్ద కృష్ణా జిల్లాలోకి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విడుదల చేశారు. కాలువ వద్ద మంత్రి బుధవారం పూజలు నిర్వహించి గోదావరి జలాలకు హారతిచ్చారు. తొలుత పోలవరం కాలువకు  కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులో అడ్డంగా మట్టికట్ట ఏర్పాటు చేశారు.

ఆ కట్టకు గండికొట్టి మంత్రి జలాలను కృష్ణా జిల్లాలోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎంపీ  మాగంటి బాబు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement