డివైడర్ను ఢీకొన్న కారు; ఐదుగురు దుర్మరణం | Five killed, Car hits devider on the Yamuna express way | Sakshi
Sakshi News home page

డివైడర్ను ఢీకొన్న కారు; ఐదుగురు దుర్మరణం

Jun 4 2015 8:26 PM | Updated on Aug 14 2018 3:22 PM

ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో యుమున ఎక్స్ప్రెస్వేపై గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

యూపీ: ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో యుమున ఎక్స్ప్రెస్వేపై గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. యువన ఎక్స్ప్రెస్వేపై వేగంగా వెళుతున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement