భారత్‌లోని చైనీయులకు భద్రతా సలహా! | China issues second safety advisory for its citizens in India | Sakshi
Sakshi News home page

భారత్‌లోని చైనీయులకు భద్రతా సలహా!

Aug 24 2017 12:39 PM | Updated on Sep 17 2017 5:55 PM

భారత్‌లోని చైనీయులకు భద్రతా సలహా!

భారత్‌లోని చైనీయులకు భద్రతా సలహా!

డోక్లాంలో రెండు నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్‌లో నివసిస్తున్న చైనీయులకు..

బీజింగ్‌: డోక్లాంలో రెండు నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్‌లో నివసిస్తున్న చైనీయులకు ఆ దేశ ప్రభుత్వం తాజాగా భద్రతా సలహాను జారీచేసింది. వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టాలని, స్థానిక భద్రతాపరమైన పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరిజు వేసుకోవాలని భారత్‌లోని చైనీయులకు సూచించింది. డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా సర్కారు జారీచేసిన రెండో భద్రతాపరమైన సలహా ఇదని ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

భారత్‌లో చైనీయులు ఎదుర్కొంటున్న పలు బెదిరింపులు, ముప్పుల గురించి వివరించిన ఆ దేశ మీడియా.. అనవసరంగా భారత్‌కు వెళ్లొద్దని తమ దేశ పౌరులకు సూచించింది. గతంలో జూలై 8న చైనా జారీచేసిన అడ్వయిజరీ కన్నా తాజా అడ్వయిజరీ తీవ్రంగా ఉండటం గమనార్హం. 'ప్రకృతి విపత్తులు, ట్రాఫిక్‌ ప్రమాదాలు, వ్యాధుల వ్యాప్తి తరచూ భారత్‌లో చోటుచేసుకుంటాయి' అంటూ ఈ అడ్వయిజరీలో చెప్పుకొచ్చింది. ఈ కారణాల వల్లే వీసా గడువు ముగిసినా పలువురు చైనీయులు ఇంకా భారత్‌లోనే ఉన్నారంటూ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement