మాజీ అధ్యక్షుడి భార్యతో 'ఆప్' ఎమ్మెల్యే హద్దు మీరాడని ఆరోపణ! | BJP accuses AAP MLA of misbehaviour | Sakshi
Sakshi News home page

మాజీ అధ్యక్షుడి భార్యతో 'ఆప్' ఎమ్మెల్యే హద్దు మీరాడని ఆరోపణ!

Jan 7 2014 2:32 AM | Updated on Apr 4 2018 7:42 PM

అసభ్యంగా ప్రవర్తించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాజేశ్ గార్గ్ పై బీజేపీ ఆరోపణలు చేసింది.

అసభ్యంగా ప్రవర్తించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాజేశ్ గార్గ్ పై బీజేపీ ఆరోపణలు చేసింది. ఓ ఎన్ జీవో ను నడుపుతున్న మాజీ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా సతీమణి శోభా గుప్తాతో ఓ కమ్యూనిటీ సెంటర్ వద్ద రాజేశ్ గార్గ్ అతని అనుచరులు అనుచితంగా అసభ్య పదజాలంతో నిందించారని బీజేపీ ఆరోపించింది. రాజేశ్ గార్డ్ వ్యవహార తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేజ్రివాల్ ను కలిశారు. 
 
రాజేశ్ గార్డ్ వ్యవహార తీరును అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హర్ష వర్ధన్ ప్రస్తావించి.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు రౌడీయిజం ప్రదర్శిస్తున్నారని హర్ష వర్ధన్ ఆరోపించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణల్ని రాజేశ్ గార్గ్ ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. రోహిణి లో ప్రస్తుతం నడుపుతున్న ఎన్ జీవో ప్రదేశాన్ని 2004లో ఆక్రమించారని.. అయితే సామాజిక కార్యక్రమాలకు కాకుడా పార్టీ పనులకు ఉపయోగించడంతో ఆమెను తాను ప్రశ్నించాను అని అన్నారు. 
 
ఆ సమయంలో తనవెంట వెయి మంది కార్యకర్తలు కూడా ఉన్నారన్నారు. తనపై చేసిన ఆరోపణల్ని రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజేశ్ గార్డ్  సవాల్ విసిరారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తానని ముఖ్యమంత్రి కేజ్రివాల్ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement