breaking news
Shobha Gupta
-
లైంగిక దాడి ఘటనలకు ప్రాధాన్యమివ్వండి
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్న పత్రాల లీకేజీపై జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో మహిళలపై జరిగిన లైంగికపరమైన దాడులకు ప్రాధాన్యమివ్వాలని సుప్రీంకోర్టు హైపవర్ విచారణ కమిటీకి సోమవారం స్పష్టం చేసింది. జూలై 20న జరిగిన ఆందోళనల్లో మహిళలపై లైంగికంగా దాడులు జరిగాయని, అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై సూమోటోగా విచారించాలని సీనియర్ న్యాయవాది శోభా గుప్తా చేసిన విజ్ఞప్తిపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది. బాధిత మహిళలు నేరుగా ఫిర్యాదులు చేసేందుకు వీలుగా జిల్లా జడ్జి లేదా తత్సమానమైన అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని కూడా శోభా గుప్తా బెంచ్‌ను కోరారు. సీజేఐ మాట్లాడుతూ... ఆందోళనకారులపై లైంగిక దాడులు జరిగినట్లుగా వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యమిచ్చి హైపవర్ ఎంక్వైరీ కమిటీ విచారణ జరుపుతుందని స్పష్టం చేశారు. గత వారం తాము చేసిన ఆదేశాల్లోనూ ఈ విషయాన్ని స్పష్టం చేశామని, మధ్యంతర నివేదిక దాఖలు చేయమని హైపవర్ ఎంక్వైరీ కమిటీకి చెప్పామని సీజేఐ వివరించారు. జంతర్‌మంతర్ అల్లర్ల సమయంలో పోలీసుల అతి చర్యలపై విచారణకు సుప్రీంకోర్టు ఆగస్టు 20న హైపవర్ ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
మాజీ అధ్యక్షుడి భార్యతో 'ఆప్' ఎమ్మెల్యే హద్దు మీరాడని ఆరోపణ!
అసభ్యంగా ప్రవర్తించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాజేశ్ గార్గ్ పై బీజేపీ ఆరోపణలు చేసింది. ఓ ఎన్ జీవో ను నడుపుతున్న మాజీ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా సతీమణి శోభా గుప్తాతో ఓ కమ్యూనిటీ సెంటర్ వద్ద రాజేశ్ గార్గ్ అతని అనుచరులు అనుచితంగా అసభ్య పదజాలంతో నిందించారని బీజేపీ ఆరోపించింది. రాజేశ్ గార్డ్ వ్యవహార తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేజ్రివాల్ ను కలిశారు. రాజేశ్ గార్డ్ వ్యవహార తీరును అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హర్ష వర్ధన్ ప్రస్తావించి.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు రౌడీయిజం ప్రదర్శిస్తున్నారని హర్ష వర్ధన్ ఆరోపించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణల్ని రాజేశ్ గార్గ్ ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. రోహిణి లో ప్రస్తుతం నడుపుతున్న ఎన్ జీవో ప్రదేశాన్ని 2004లో ఆక్రమించారని.. అయితే సామాజిక కార్యక్రమాలకు కాకుడా పార్టీ పనులకు ఉపయోగించడంతో ఆమెను తాను ప్రశ్నించాను అని అన్నారు. ఆ సమయంలో తనవెంట వెయి మంది కార్యకర్తలు కూడా ఉన్నారన్నారు. తనపై చేసిన ఆరోపణల్ని రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజేశ్ గార్డ్ సవాల్ విసిరారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తానని ముఖ్యమంత్రి కేజ్రివాల్ అన్నారు.


