అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం: 28 మంది మృతి | At least 28 dead in road accident in Assam | Sakshi
Sakshi News home page

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం: 28 మంది మృతి

Oct 3 2013 9:43 AM | Updated on Sep 1 2017 11:18 PM

బార్పేట్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున భారీ ట్రక్ ఎదురుగా వస్తున్న రెండు మీని వ్యాన్లను ఢీ కొన్న ఘటనలో 28 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు.

బార్పేట్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున భారీ ట్రక్ ఎదురుగా వస్తున్న రెండు మీని వ్యాన్లను ఢీ కొన్న ఘటనలో 28 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. మృతుల్లో 13 మంది చిన్నారులతోపాటు ఐదుగురు మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. ఆ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించిన పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

 

దాంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారని వివరించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతులంతా ఇటుక బట్టీ కార్మికులేనని వారు తెలిపారు. పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తున్న భారీ ట్రక్ ఎదురుగా వస్తున్న మీని వ్యాన్లను ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement