గుజరాత్ హోంమంత్రి ఇంటికి నిప్పు | Army deployed in three Gujarat cities | Sakshi
Sakshi News home page

గుజరాత్ హోంమంత్రి ఇంటికి నిప్పు

Aug 27 2015 1:23 PM | Updated on Sep 3 2017 8:14 AM

గుజరాత్ హోంమంత్రి ఇంటికి నిప్పు

గుజరాత్ హోంమంత్రి ఇంటికి నిప్పు

గుజరాత్ అగ్నిగుండంగా మారుతోంది.

అహ్మదాబాద్: గుజరాత్ అగ్నిగుండంగా మారుతోంది. ఇతర వెనుకబడిన తరగతుల్లో(ఓబీసీ) తమను చేర్చాలన్న డిమాండ్‌తో పటేల్ సామాజిక వర్గీయులు చేపట్టిన ఆందోళన మరింత హింసాత్మకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా మారిన పటేళ్ల ఆందోళన గురువారం రాష్ట్ర హోంమంత్రి ఇంటిని తాకింది. ఈరోజు కొంతమంది ఆందోళన కారులు హోంమంత్రి రజనీ పటేల్ ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రజనీ పటేల్ ఇళ్లు కొంతమేర దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

గత రెండు రోజుల నుంచి ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తుండటంతో కేంద్ర బలగాలు రంగాలోకి దిగాయి. గుజరాత్ లో పటేళ్లు ఎక్కువగా ఉండే సూరత్, రాజ్ కోట్, మహ సేన నగరాల్లో  భారీ బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement