ఎస్‌బీఐకి నకిలీ నోట్ల సెగ..ఈసారి ఎలా అంటే.. | After Delhi, Now Fake Rs. 2,000 Note Comes Out Of SBI ATM In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐకి నకిలీ నోట్ల సెగ..ఈసారి ఎలా అంటే..

Feb 25 2017 8:18 PM | Updated on Sep 15 2018 3:43 PM

ఎస్‌బీఐకి  నకిలీ నోట్ల సెగ..ఈసారి ఎలా అంటే.. - Sakshi

ఎస్‌బీఐకి నకిలీ నోట్ల సెగ..ఈసారి ఎలా అంటే..

ఒకవైపు అసోసియేటెడ్‌ బ్యాంకుల విలీనంతో అతిపెద్ద బ్యాంకు గా అవతరించనున్న దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాకు నకిలీ నోట్ల సెగ గట్టిగా తాకు తోంది

షాజహాన్‌ పూర్: ఒకవైపు అసోసియేటెడ్‌ బ్యాంకుల విలీనంతో అతిపెద్ద బ్యాంకు గా అవతరించనున్న దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్‌  బ్యాంక్‌ ఆఫ్ ఇండియాకు నకిలీ నోట్ల సెగ  గట్టిగా తాకు తోంది.  ఎస్‌బీఐ ఏటీఎంలలో  ఈ నకిలీ నోట్లు దర్శనమివ్వడం ఆందోళన  రేకెత్తించింది. మొన్నఢిల్లీ ఎస్‌బీఐ  ఏటీంలో  నకిటీ నోట్లు కలవరం రేపగా, తాజాగా  ఉత్తరప్రదేశ్‌  షాజహాన్పూర్ లోని ఎస్‌బీఐ ఏటీఎంలో నకిలీ రూ.2 వేల నోట్ల  వ్యవహారం దుమారం రేపుతోంది.  స్కాన్‌ చేసిన  నకిలీ రూ.2 వేల నోటు దర్శనిమిచ్చిన ఘటన  గురువారం చోటుచేసుకుంది.
 
షాజహాన్పూర్ నివాసి పునీత్ గుప్తా   స్థానిక ఎస్‌బీఐ ఏటీఎంలో రూ. 10 వేలు డ్రా చేశాడు. ఇందులో ఐదు  రూ.2 వేల నోట్లు వచ్చాయి. అయితేవీటిలో   నాలుగు సక్రమైనవిరాగా.. ఒకటి   స్కాన్ చేసిన నోటు కావడంతో గుప్తా షాకయ్యాడు. ఆయనతో పాటు అక్కడ క్యూలో ఉన్న వారంతా దిగ్బ్రాంతికి లోనయ్యారు.   ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల కుట్ర ఉందని వారంతా ఆరోపిచారు. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ  ఆందోళనకు  దిగారు.   దీంతో అక్కడ పెద్ద గందరగోళమే చెలరేగింది. చివరికి పోలీసులు వచ్చిపరిస్థితిన చక్కదిద్దారు. సంబంధిత బ్యాంకు పై పోలీసులకు ఫిర్యాదు  చేశారు.
మరోవైపు ఈ ఘటనపై ఎస్‌బీఐ స్పందించింది. నోట్ల నాణ్యత పర్యవేక్షణ కోసం  చాలా బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేశామని తెలిపింది. బ్యాంక్ నుంచి   పంపిణీ చేయడానికి స్వీకరించబడిన నోట్లు, ఏటీఎంలు లేదా దాని శాఖల ద్వారా నోట్‌ సార్టింగ్‌ మెషీన్స్‌ద్వారా  ప్రాసెస్ చేయబడతాయని.. కనుక నకిలీ నోట్లను  పంపిణీ చేసే అవకాశం లేదని ఒక ప్రకటనలో తెలిపింది.   మరోవైపు  సదరు ఏటీఎం లో ఆఖరుసారి  నగదు నింపిన వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement