పాకిస్థాన్లో 12 మంది ఉగ్రవాదుల కాల్చివేత | 12 militants killed in Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్లో 12 మంది ఉగ్రవాదుల కాల్చివేత

Sep 22 2013 4:14 PM | Updated on Mar 28 2019 6:10 PM

పాకిస్థాన్లో భద్రతా దళాలు 12 మంది ఉగ్రవాదుల్ని కాల్చిచంపాయి.

పాకిస్థాన్లో భద్రతా దళాలు 12 మంది ఉగ్రవాదుల్ని కాల్చిచంపాయి. పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ సరిహద్దులో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పాక్ సరిహద్దు భద్రత దళాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, భారీ సంఖ్యలో ఉన్న సాయుధ ఉగ్రవాదులు తారసపడ్డారు.

ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఉగ్రవాదులు మరణించగా, ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని సైనిక అధికారులు ధ్రువీకరించినట్టు పాక్ చానెల్ ఒకటి పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement