మహిళపై అత్యాచారం, హత్య | woman raped and killed | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారం, హత్య

Aug 13 2015 3:10 PM | Updated on Jul 30 2018 8:29 PM

గుర్తుతెలియని మహిళపై అత్యాచారం చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు.

వనపర్తి (మహబూబ్‌నగర్ జిల్లా) : గుర్తుతెలియని మహిళపై అత్యాచారం చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం నాగారం గ్రామంలో గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నాగారం గ్రామానికి చెందిన కొంతమంది పశువుల కాపరులు గ్రామంలోని రాజాగారితోటలో పశువుల మేతకు వెళ్లారు. కాగా అక్కడ మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. మహిళపై అత్యాచారం చేసి ఆపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా మహిళ వివరాలు, ఆమె హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు, దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement