ఒంటికి నిప్పంటుకొని మహిళ మృతి | Woman dies to stick in fire | Sakshi
Sakshi News home page

ఒంటికి నిప్పంటుకొని మహిళ మృతి

Jun 22 2015 11:27 PM | Updated on Sep 2 2018 3:57 PM

వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది.

శంకర్‌పల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ-2 రామేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సింగాపూర్ గ్రామానికి చెందిన చిట్టి(30) ఓ పూరి గుడిసెలో ఉంటూ స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఆదివారం ఉదయం ఆమె గుడిసెలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందింది. మృతురాలికి ఓ కూతురు ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement