స్కూలు బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి | Woman dies in Road accident | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి

Dec 11 2015 4:58 PM | Updated on Apr 3 2019 7:53 PM

స్కూల్ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం బుజ్రాన్‌పల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

పెద్ద శంకరంపేట (మెదక్) : స్కూల్ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం బుజ్రాన్‌పల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బుజ్రాన్‌పల్లికి చెందిన మాండ్రు రుక్కమ్మ (60) గ్రామం నుంచి పెద్ద శంకరంపేట వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న నారాయణఖేడ్‌కు చెందిన స్కూల్‌ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రుక్కమ్మను కారులో సంగారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. కాగా  రుక్కమ్మకు భర్త గంగయ్యతో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement