ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో | under MRPS strike | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

Jul 31 2016 8:15 PM | Updated on Sep 4 2017 7:13 AM

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం చిలుకూరుకు చెందిన దళితవాడ సమీపంలో కోదాడ – హుజూర్‌నగర్‌ రోడ్డుపై ఎమ్మార్పీఎస్‌ నాయకులు రాస్తారోకో చేశారు.

చిలుకూరు: ఎస్సీ వర్గీకరణ చేయాలని  డిమాండ్‌ చేస్తూ ఆదివారం చిలుకూరుకు  చెందిన దళితవాడ సమీపంలో కోదాడ – హుజూర్‌నగర్‌ రోడ్డుపై ఎమ్మార్పీఎస్‌ నాయకులు రాస్తారోకో చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన  100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతామని చెప్పిన ప్రభుత్వం నేటి వరకు బిల్లు ప్రవేశ పెట్టలేదని అన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కోటేష్, మండల కార్యదర్శి కందుకూరి ఎల్లయ్య, నాయకులు సిద్దెల శ్రీను, జిల్లా శ్రీను, మల్లేపంగు ఉపేందర్, వీరబాబు, రాంబాబు, ప్రవీణ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement