రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | two died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Apr 12 2015 12:22 PM | Updated on Aug 25 2018 6:06 PM

నల్గొండ జిల్లా ఆలేరు శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

నల్గొండ: నల్గొండ జిల్లా ఆలేరు శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి వరంగల్కు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యానును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. డీసీఎంలో ప్రయాణిస్తున్న వంశీరెడ్డి (28), పరమేశ్వర్ (32) అక్కడికక్కడే మరణించారు. మృతులు మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఆలేరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement