రెండు లారీలు ఢీ: ఇద్దరి మృతి | two died in a road accident in khammam | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ: ఇద్దరి మృతి

Mar 29 2016 8:35 AM | Updated on Aug 25 2018 6:06 PM

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రామకృష్ణాపురం సమీపంలో మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

కల్లూరు(ఖమ్మం): ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రామకృష్ణాపురం సమీపంలో మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి రాజస్థాన్‌కు నిమ్మకాయల లోడుతో వెళ్తున్న లారీని, ఎదురుగా టర్పెంటైన్‌తో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే చనిపోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement