ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి | three students dies after sink in water | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

Jul 19 2015 5:35 PM | Updated on Apr 3 2019 8:07 PM

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలోని ఊరచెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలోని ఊరచెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సత్తుపల్లి పట్టణానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఆదివారం చెరువు చూసేందుకు వెళ్లారు. ఈత రాకపోవడంతో అందులో దిగిన తాటి దిలీప్ (12), మాదాస్ ప్రశాంత్(12) ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు మాదాసు ధనుష్ (11) నీటిలో దిగగా ముగ్గురూ మునిగిపోయారు. మరో ఇద్దరు విద్యార్థులు కేకలు వేయగా దగ్గర్లోని వారు స్పందించి వచ్చేసరికి నీట మునిగిన ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రశాంత్, ధనుష్ స్వయానా సోదరులు. మిషన్ కాకతీయలో భాగంగా ఇటీవలే ఊరచెరువులో పూడిక తీయడంలో నీటి మట్టం ఎక్కువగా ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement