మట్కా స్థావరాలపై పోలీసుల దాడి | The police attacks on the matka hubs | Sakshi
Sakshi News home page

మట్కా స్థావరాలపై పోలీసుల దాడి

Dec 28 2014 1:00 AM | Updated on Oct 16 2018 2:30 PM

కాగజ్‌నగర్ పట్టణంలోని మట్కా స్థావరాలపై శనివారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించి..

కాగజ్‌నగర్ టౌన్ : కాగజ్‌నగర్ పట్టణంలోని మట్కా స్థావరాలపై శనివారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించి, ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదుతోపాటు మట్కా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ గుమ్మి చక్రవర్తి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పెట్రోల్‌పంపు, తిరందాజ్ ఏరియా, మార్కెట్ ఏరియాలలో పట్టణ సీఐ జలగం నారాయణరావు ఆధ్వర్యంలో పోలీస్ పార్టీ దాడులు నిర్వహించింది.

ఇందులో మట్కా జూదం నిర్వహిస్తున్న నరేశ్, జాడి శ్రీకాంత్, స్వరాజ్, యుసుఫ్‌ఖాన్, గణపతి పట్టుపడగా, వారి వద్ద నుంచి రూ.14955లతోపాటు మట్కా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు గతంలో కూడా మట్కా కేసుల్లో ఉన్నారు. వారిని ఆదివారం తహశీల్దార్  ఎదుట బైండోవర్ చేయనున్నట్లు డీఎస్సీ తెలిపారు. మట్కా జూదం వైపు వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఏఎస్సై మాదం రాజేశ్వర్, హెచ్‌సీలు సయ్యద్ సర్దార్, డి.సురే శ్ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement