కేంద్రం తీరుతోనే ఉద్యోగుల్లో ఆందోళన | The employees concerned | Sakshi
Sakshi News home page

కేంద్రం తీరుతోనే ఉద్యోగుల్లో ఆందోళన

Jun 7 2014 4:40 AM | Updated on Sep 2 2017 8:24 AM

కేంద్రం తీరుతోనే ఉద్యోగుల్లో ఆందోళన

కేంద్రం తీరుతోనే ఉద్యోగుల్లో ఆందోళన

కేంద్రం చేస్తున్న గందరగోళం వల్లనే ఉద్యోగుల్లో ఆందోళన మొదలైందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు.

టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్

హన్మకొండ, న్యూస్‌లైన్: కేంద్రం చేస్తున్న గందరగోళం వల్లనే ఉద్యోగుల్లో ఆందోళన మొదలైందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు తెలంగాణ ఉద్యోగులే ఉండాలన్న డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ కీర్తి స్తూపం నుంచి చేపట్టిన ర్యాలీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని ఏఒక్క ఉద్యోగీ ఆంధ్రా ప్రభుత్వంలో పనిచేయడానికి వీల్లేదని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఇక్కడి ఉద్యోగులు మాత్రమే ఉండాల న్నారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement