రెండ్రోజుల్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు?  | Telangana Inter Results Update | Sakshi
Sakshi News home page

రెండ్రోజుల్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు? 

Jun 15 2020 2:58 AM | Updated on Jun 15 2020 2:59 AM

Telangana Inter Results Update - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాలను ఎప్పుడు విడుదల చేయాలన్న అంశంపై సోమవారం స్పష్టత రానుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నేడు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు సమావేశమై తేదీని ఖరారు చేయనున్నారు. వచ్చే రెండు రోజుల్లో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఫలితాల ప్రాసెస్‌ పూర్తయింది. ఫలితాలు సరిగ్గా వచ్చాయా? ఏమైనా లోపాలు ఉన్నాయా? అన్న దానిపై ఒకటికి రెండుసార్లు పరీశీలిస్తున్నారు. కాగా, కరోనా నేపథ్యంలో ఈసారి ఫలితాలను నేరుగా ఆన్‌లైన్‌లోనే విడుదల చేసే అవకాశం ఉంది. అన్నీ ఓకే అనుకుంటే, మంగళవారం విడుదల చేయాలన్న ఆలోచన ఉంది. అయితే అది సాధ్యం కాకపోతే బుధవారం (17వ తేదీన) విడుదల చేసేందుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement