ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల | AP Inter Exams 2026 Results Released | Sakshi
Sakshi News home page

ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Apr 15 2026 10:35 AM | Updated on Apr 15 2026 6:22 PM

AP Inter Exams 2026 Results Released

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 77 శాతం ఉత్తీర్ణత, సెకండ్‌ ఇయర్‌లో 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను వేగంగా, సులభంగా చూసుకోవడానికి కింద లింక్‌ను ఉపయోగించగలరు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు రాశారు.

కాగా, మే 21 నుంచి జూన్ 4 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ జరగనుంది. జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఈ నెల 20 నుంచి 27 వరకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Breaking News : ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement