రెతుబంధు చెక్కును తిరిగి ఇచ్చిన తనికెళ్ల భరణి  | Tanikella Bharani Gave Back Rythu Bandhu Cheque | Sakshi
Sakshi News home page

రెతుబంధు చెక్కును తిరిగి ఇచ్చిన తనికెళ్ల భరణి 

Jun 7 2018 8:50 AM | Updated on Jun 7 2018 9:10 AM

Tanikella Bharani Gave Back  Rythu Bandhu Cheque - Sakshi

చెక్కును తిరిగి ఇస్తున్న తనికెళ్ల భరణి

షాబాద్‌(చేవెళ్ల) :  సిటీ నటుడు తనికెళ్ల భరణి తనకు వచ్చిన రైతుబంధు చెక్కను తిరిగి అధికారులకు అందజేశారు. షాబాద్‌ మండలంలోని చిన్నసోలిపేట్‌ గ్రామంలో ఆయనకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. దానికి సంబంధించి రైతుబంధు పథకం ద్వారా రూ.10 వేల చెక్కు వచ్చింది. ఆ చెక్కును బుధవారం తహసీల్ధార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి అందజేశారు. ఆ చెక్కను తనికెళ్ల భరణి తిరిగి అధికారులకు అందజేశారు.

ఆ మొత్తాన్ని రాష్ట్ర రైతునిధికి జమచేయాలని సూచించారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆర్ధిక వెసులుబాటు కలిగిన వారందరు ఉదారంగా సాగుపెట్టుబడి చెక్కులను తిరిగి రాష్ట్ర రైతుసంఘం నిధికి ఇవ్వాలని కోరారు.     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement