ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి | suspicious death of a Inter student | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Mar 1 2016 5:08 PM | Updated on Sep 3 2017 6:46 PM

ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం రేకుర్తిలో చోటు చేసుకుంది.

ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం రేకుర్తిలో చోటు చేసుకుంది. మండలంలోని ఆల్పోర్స్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న గంటా భాను(16) సోమవారం అస్వస్థతకు గురికావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.

కాలేజీ యాజమాన్యం నిర్లక్షం వల్లే తమ కూతురు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి స్వస్థలం జగిత్యాల మండలం నర్సింగాపూర్.

 

Advertisement
 
Advertisement
Advertisement