కీర్తన తల్లిదండ్రులను ఓదార్చిన ఎంపీ అవినాష్ రెడ్డి | MP Avinash Reddy met Keerthana family in YSR district | Sakshi
Sakshi News home page

కీర్తన తల్లిదండ్రులను ఓదార్చిన ఎంపీ అవినాష్ రెడ్డి

Apr 12 2026 5:26 PM | Updated on Apr 12 2026 5:52 PM

MP Avinash Reddy met Keerthana family in YSR district

వైఎస్సార్‌జిల్లా: ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇంటర్ విద్యార్థిని కీర్తన తల్లిదండ్రులను ఎంపీ అవినాష్ రెడ్డి ఓదార్చారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఉన్నారు.

అనంతరం,ఎంపీ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓ దుర్మార్గుడి చేతిలో కీర్తన మరణించడం అత్యంత బాధాకరం. తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో ఆడబిడ్డలపై ఇటువంటి దాడులు మితిమీరిపోతున్నాయి.

తీవ్రమైన, కఠినమైన చర్యలకు ప్రభుత్వం వెనుకాడకూడదు.ఎవరికైనా ఇటువంటి ఆలోచన రావాలంటేనే భయపడేలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. రెండేళ్లుగా ఇలా ఆడబిడ్డలపై, చివరికి చిన్నారులపై దాడులు పెరిగిపోయాయి. చివరికి ఇంటికి వచ్చి గొంతు కోసే పరిస్థితులు నెలకొన్నాయి.

ముఖ్యంగా పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు, మెరుగైన బుద్దులు కూడా నేర్పాలి. గంజాయి, బెల్టు షాపులు కూడా మితిమీరి ఉండటం వల్ల ఇలాంటి సంఘటాలు పెరిగిపోతున్నాయి. గంజాయి ఎక్కడంటే అక్కడ దొరుకుతోంది...గ్రామానికి రెండు మూడు బెల్టుషాపులు ఉన్నాయి.ఇలాంటి మత్తు పదార్థాల వల్ల మనుషులు కూడా మృగాలుగా మారుతున్నారు. గంజాయి, బెల్టు షాపులను తక్షణమే అరికట్టాలి’ అని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement