AP: ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృత్యువాత | Three Boys Drown While Swimming In Alluri District | Sakshi
Sakshi News home page

అల్లూరి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృత్యువాత

Apr 12 2026 5:41 PM | Updated on Apr 12 2026 5:49 PM

Three Boys Drown While Swimming In Alluri District

పన్నెడ: అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెదబయలు మండలం పన్నెడ గ్రామంలో ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి మృత్యవాత పడిన ఘటన ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. వాగులో ఈతకు వెళ్లడంతో ముగ్గురు బాలురు మృతిచెందారు. మొత్తం ఐదుగురు బాలురు బ్యాచ్‌గా ఈతకు వెళ్లగా, ఇద్దర్ని స్థానికులు రక్షించారు. మృతి చెందిన బాలురుని ప్రదీప్‌(11), హర్షిత్‌(10), బబ్లూ(11)లుగా గుర్తించారు.

ఇటీవలే ల ఏజెన్సీలోని వాగులో స్నానానికి దిగి ముగ్గురు బాలికలు మృతి చెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో దుర్ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. 

Advertisement
 
Advertisement
Advertisement