లారీ ఢీకొని విద్యార్థి మృతి | Student dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని విద్యార్థి మృతి

Nov 17 2015 3:00 PM | Updated on Nov 9 2018 5:02 PM

బస్సు దిగి ఇంటికి నడిచి వెళ్తున్న ఓ విద్యార్థి ప్రాణాన్ని లారీ హరించి వేసింది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం గేదెళ్లగూడెం గ్రామం వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

వలిగొండ (నల్లగొండ) : బస్సు దిగి ఇంటికి నడిచి వెళ్తున్న ఓ విద్యార్థి ప్రాణాన్ని లారీ హరించి వేసింది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం గేదెళ్లగూడెం గ్రామం వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మునికుంట్ల ప్రకాశ్(20) రామన్నపేటలోని కళాశాలలో ల్యాబ్‌ టెక్నీషియన్(ఎంఎల్‌టీ) చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం 2.40 గంటల సమయంలో ప్రకాశ్ కళాశాల నుంచి వచ్చి గ్రామం వద్ద బస్సు దిగి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో వేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు లారీ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement