రేణుకా చౌదరీ ధర్నా, రాస్తారోకో! | Renuka Chowdary staged Dharna, Rasta Roko | Sakshi
Sakshi News home page

రేణుకా చౌదరీ ధర్నా, రాస్తారోకో!

Sep 4 2014 2:59 PM | Updated on Mar 18 2019 9:02 PM

రేణుకా చౌదరీ ధర్నా, రాస్తారోకో! - Sakshi

రేణుకా చౌదరీ ధర్నా, రాస్తారోకో!

రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరీ ఖమ్మం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఖమ్మం: రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరీ ఖమ్మం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. భధ్రాచలం మండలంలోని మూడు గ్రామ పంచాయితీలను తెలంగాణలోనే ఉంచాలంటూ డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రేణుకా చౌదరీ ఆరోపించారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ఏడు మండలాలను విలీనం చేసుకునే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర పునర్విభజన బిల్లు ప్రకారం ఈ ఏడాది జూన్ 2 నుంచి ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిం చిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement