గుడుంబా అడ్డాలపై దాడులు | Rajendranagar Excise police raids in Gudumba centers | Sakshi
Sakshi News home page

గుడుంబా అడ్డాలపై దాడులు

May 28 2015 7:56 PM | Updated on Mar 28 2018 11:08 AM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎక్సైజ్ పోలీసులు గురువారం స్టేషన్ పరిధిలోని పలు గుడుంబా అడ్డాలపై దాడులు నిర్వహించారు.

రంగారెడ్డి :  రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎక్సైజ్ పోలీసులు గురువారం స్టేషన్ పరిధిలోని పలు గుడుంబా అడ్డాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది నిందితులతో పాటు దాదాపు 3 వేల గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపిన సమాచారం మేరకు... బుద్వేల్ ప్రాంతానికి చెందిన జావీద్ ఖాన్ అడ్డాపై దాడి చేసి 83 ప్యాకెట్లు, అత్తాపూర్‌లోని తుల్జారామ్ అడ్డాపై దాడి చేసి 42 ప్యాకెట్లు, అలిజాపూర్ ప్రాంతంలోని కిషన్ సింగ్ అడ్డాలో 150 ప్యాకెట్లు, పుప్పాల్‌గూడలోని మనోజ్ సింగ్ అడ్డాలో 8, సంతోష్ సింగ్, బోలు అడ్డాలలో1500, నెక్‌నమ్‌పూర్‌లోని చోటమ్‌సింగ్ అడ్డాలో 500, శంకర్ అడ్డాపై దాడి చేసి 558 ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. తమ ప్రాంతంలో ఎక్కడ గుడుంబా వ్యాపారం జరుగుతున్నా తమకు సమాచారం అందించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement