సైనికుల్లా పనిచేయండి | Ponnam Prabhakar Said To Cadre Work Soldiers | Sakshi
Sakshi News home page

సైనికుల్లా పనిచేయండి

Nov 21 2018 6:53 PM | Updated on Mar 18 2019 7:55 PM

Ponnam Prabhakar Said To Cadre Work Soldiers - Sakshi

మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌

సాక్షి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకు ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం ఇందిరాగార్డెన్‌లో పట్టణంలోని 50 డివిజన్లకు చెందిన బూత్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎంపీగా ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో పట్టణంపై దృష్టిసారించలేకపోయానని అప్పుడు పరిధి 31 మండలాలు, ఐదు పట్టణాలు విస్తీర్ణం ఉండడం వల్ల సమయం సరిపోలేదన్నారు.

ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందుబాటులో ఉండి పట్టణంలోని కార్యకర్తలకు పూర్తి సమయాన్ని కేటాయిస్తానని హమీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ జిమ్మిక్కులను ప్రజల్లో వివరించి కాంగ్రెస్‌కు ఓట్లు వేయించేలా బూత్‌ లెవల్‌లో కష్టపడాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, చల్మెడ లక్ష్మినర్సింహారావు, కర్ర రాజశేఖర్, ఆమ ఆనంద్, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, బుచ్చిరెడ్డి, రహమత్, ఆకుల ప్రకాష్, ఉమాపతి, ఆరీఫ్, ఉప్పరి రవి, దిండిగాల మధు, తాజ్, చెర్ల పద్మ, కన్న కృష్ణ, అంజనీకుమార్, ప్రసాద్, శ్రీనివాస్, రవికుమార్, దండి రవీందర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement