పాస్‌పోర్టులు స్వాధీనం | Passport Collecting From Isolation Ward Patients in Nizamabad | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్టులు స్వాధీనం

Mar 26 2020 12:43 PM | Updated on Mar 26 2020 12:43 PM

Passport Collecting From Isolation Ward Patients in Nizamabad - Sakshi

మోపాల్‌ మండలంలో పాస్‌పోర్టు స్వాధీనం చేసుకుంటున్న అధికారులు

నిజామాబాద్‌ అర్బన్‌: విదేశాల నుంచి వచ్చి జిల్లాలో ఐసోలేషన్‌లో ఉంటున్న వారి పాస్‌పోర్టులను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం 235 మంది పాస్‌పోర్ట్‌లు తీసుకున్న రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు నాలుగు నెలల వరకు విదేశాలకు వెళ్లవద్దని వారికి సూచించారు. మరో 2,460 మంది పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపారు. 

యువకుడికి అనుమానిత లక్షణాలు
డిచ్‌పల్లి : డిచ్‌పల్లి మండలం నక్కలగుట్ట తండా గ్రామ పంచాయతీ పరిధిలోని నడిమితండాకు చెందిన యువకుడికి కరోనా అనుమానిత లక్షణాలు కన్పించాయి. అప్రమత్తమైన అధికారులు అతడిని వెంటనే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల గల్ఫ్‌ నుంచి వచ్చిన యువకుడి నుంచి పాస్‌పోర్టు స్వాధీనం చేసుకునేందుకు తహసీల్దార్‌ వేణుగోపాల్‌ తదితరులు వెళ్లగా  యువకుడు జ్వరంతో ఉండి కరోనా లక్షణాలు కనిపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement