గాంధీ విగ్రహం ముందు కార్మికుల వినూత్న నిరసన | Panchayat Workers continue dharna | Sakshi
Sakshi News home page

గాంధీ విగ్రహం ముందు కార్మికుల వినూత్న నిరసన

Aug 13 2015 7:42 PM | Updated on Sep 3 2017 7:23 AM

గాంధీ విగ్రహం ముందు కార్మికుల వినూత్న నిరసన

గాంధీ విగ్రహం ముందు కార్మికుల వినూత్న నిరసన

జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ముందు పంచాయతీ కార్మికులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు.

కరీంనగర్ (సుల్తానాబాద్) : జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ముందు పంచాయతీ కార్మికులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు చెవులు, కళ్లు, నోరు మూసుకుని నిరసన తెలియజేశారు.

44 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరి అవలంబించడం సరికాదన్నారు. గాంధీ మార్గాన్ని అవలంబిస్తున్న పంచాయతీ కార్మికులకు స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా శుభవార్త అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్చలు జరిపి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement