తెలంగాణలో కొత్త మద్యం విధానం | new excise policy in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్త మద్యం విధానం

Aug 26 2015 2:33 PM | Updated on Sep 3 2017 8:10 AM

తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానం ప్రకటించింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానం ప్రకటించింది.  జీహెచ్ ఎంసీ, మున్సిపాలిటీల్లో కొత్త మద్యం విధానం ఖరారు చూస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ ఎంసీ పరిధిలో13 వేల జనాభా ఒక బార్ ఏర్పాటు చేయనున్నారు.

మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ప్రతి 30 వేల జనాభాకు ఒక బార్ పెట్టనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో బార్ లు కేటాయించారు. 30 వేల నుంచి 60 వేల జనాభా ఉంటే 2 బార్లు పెట్టనున్నారు. ప్రతి త్రిస్టార్ హోటల్ కు ఒక బార్ కేటాయించనున్నారు. డ్రా ద్వారా బార్లు కేటాయిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement