ప్రకాష్ జవదేకర్‌ను కలిసిన ఎంపీ కవిత బృందం | MP Kavitha meets Prakash javdekar in Delhi | Sakshi
Sakshi News home page

ప్రకాష్ జవదేకర్‌ను కలిసిన ఎంపీ కవిత బృందం

Aug 3 2018 11:13 AM | Updated on Aug 3 2018 11:14 AM

MP Kavitha meets Prakash javdekar in Delhi - Sakshi

ఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ కవిత నేతృత్వంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను శుక్రవారం కలిశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలే ఇస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీరి వేతనాలను రూ.1000 నుంచి రూ.10,500కు పెంచాలని ప్రకాష్‌ జవదేకర్‌ను కవిత కోరారు. కేంద్ర కార్మిక చట్టాలను అనుసరించి ఈపీఎఫ్, ఈఎస్ఐ  సౌకర్యాలు కూడా వారికి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కవితతోపాటూ పలువురు టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రమంత్రిని కలిసినవారిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement