‘తార’లొచ్చారు | Movie Stars Caste hes Votes in Polling Stations | Sakshi
Sakshi News home page

‘తార’లొచ్చారు

Apr 12 2019 6:48 AM | Updated on Jul 14 2019 4:41 PM

Movie Stars Caste hes Votes in Polling Stations - Sakshi

పోలింగ్‌ కేంద్రంలో అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు

బంజారాహిల్స్‌: సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో పలువురు సినీతారలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. గురువారం లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో పోలింగ్‌ బూత్‌లో సినీనటుడు అల్లు అర్జున్‌ ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో చిరంజీవి, ఆయన భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన ఓటు వేశారు. ఎఫ్‌ఎన్‌సీసీలో సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సానియా మీర్జా తన ఓటుహక్కును ఎఫ్‌ఎన్‌సీసీలోనే వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌– 45లోని ఉమెన్‌ కో– ఆపరేటివ్‌ సొసైటీలో ఓటు వేసిన అక్కినేని అమల ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. అలాగే వైస్సార్‌ సీపీ నాయకుడు, నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె మంచు లక్ష్మి ఓటు వేశారు.

కేంద్రీయ విద్యాలయలో జయసుధ..
గచ్చిబౌలి: సినీనటి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకు రాలు జయసుధ కపూర్, కుమారుడు నిహార్‌ కపూర్‌  గచ్చిబౌలిలోని జీపీఆర్‌ఏ క్వార్డ్టర్స్‌లోని కేంద్రీయ విద్యాలయలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

నానక్‌రాంగూడలో కృష్ణ, నరేష్‌..  
రాయదుర్గం: గచ్చిబౌలి డివిజన్‌ నానక్‌రాంగూడలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పలువురు సినీతారలు ఓటు వేశారు. అలనాటి నటుడు కృష్ణ, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేష్, ఆయన కుమారుడు నవీన్‌ విజయకృష్ణ, అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు.  నటుడు వేణు ఓటేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement