రైలు కిందపడి కూతురు సహా తల్లి ఆత్మహత్య | mother doughter suicide at Ghatkesara railway station | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి కూతురు సహా తల్లి ఆత్మహత్య

Oct 14 2014 1:10 AM | Updated on Nov 6 2018 7:56 PM

రైలు కిందపడి కూతురు సహా తల్లి ఆత్మహత్య - Sakshi

రైలు కిందపడి కూతురు సహా తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర రైల్వేస్టేషన్‌కు సమీపంలో సోమవారం రైలు కిందపడి కూతురితో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది.

- ఘట్‌కేసర రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఘటన
- మృతులు హైదరాబాద్ వాసులు

ఘట్‌కేసర్: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర రైల్వేస్టేషన్‌కు సమీపంలో సోమవారం రైలు కిందపడి కూతురితో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసుల కథనంప్రకారం.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన స్వప్న(25)కు కూతురు శాన్వీ(3), కుమారుడు శ్యాం ఉన్నారు. సోమవారం స్వప్న తన కూతురితో కలిసి ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాలేదు.

దీంతో కుటుంబీకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, సాయంత్రం ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల వద్ద రైల్వే ట్రాక్‌పై తల్లీకూతురు విగతజీవులుగా పడిఉన్నారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జీపీఆర్‌ఎఫ్ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement