ఎంపీటీసీ భర్త ఆత్మహత్య | man committed suicide | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ భర్త ఆత్మహత్య

Mar 28 2015 8:13 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధతో ఓ ఎంపీటీసీ భర్త ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వేములపల్లి : అప్పుల బాధతో ఓ ఎంపీటీసీ భర్త ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కుక్కడం గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కుక్కడం గ్రామానికి చెందిన ఎంపీటీసీ కుప్ప పద్మ భర్త కుప్ప కృష్ణ(42) ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కృష్ణ తన ఐదు ఎకరాల భూమితో పాటు మరో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంటను పండించాడు. భారీగా అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడి రాలేదు. అంతేకాకుండా మరో వైపు గత ఏడాది జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఈ క్రమంలో సుమారు రూ. 6లక్షల అప్పులు ఉన్నట్లు సమాచారం. రోజురోజుకీ వడ్డీ పెరిగిపోతుండటంతో పాటు అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. ఈ క్రమంలోనే శనివారం భార్యను రాయినిగూడెంలో ఉన్న అమ్మగారింటికి పంపి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన పక్కింటి యువకుడు స్థానికులకు చెప్పడంతో హుటాహుటిన అతనిని మిర్యాలగూడలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని నిర్థారించారు. విషయం తెలిసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement