ఏపీపీఎఫ్‌సీఎల్ రూ.2,500 కోట్ల అప్పు
రూ.34,872 కోట్లకు చేరిన విద్యుత్ రంగ సంస్థల అప్పు
సాక్షి, అమరావతి: బడ్జెట్ బయట అప్పుల పరంపరను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ విద్యుద్ధీకరణ సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీపీఎఫ్‌సీఎల్) తీసుకున్న రూ.2,500 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఏపీపీఎఫ్‌సీఎల్ తన సొంత వనరుల నుంచి అప్పును తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. రుణ సంస్థలకు అప్పు చెల్లించడంలో ఏపీపీఎఫ్‌సీఎల్ విఫలమైతే.. ప్రభుత్వ హామీ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ రూ.2,500 కోట్ల అప్పుతో విద్యుత్ రంగ సంస్థల ద్వారా చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు రూ.34,872 కోట్లకు చేరాయి.


