కొత్త కొత్తగా.. | land records in telangana | Sakshi
Sakshi News home page

కొత్త కొత్తగా..

Oct 14 2017 3:46 PM | Updated on Oct 14 2017 3:56 PM

land records in telangana

మెదక్‌జోన్‌: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు. రెవెన్యూ గ్రామాలలో భూ రికార్డుల ప్రక్షాళన కోసం 44 బృందాలు పని చేస్తున్నాయి. ప్రతి మం డలంలో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులతో కూడిన రెండు, మూడు బృందాలను ఏర్పాటు చేశారు. వారు ఊరూరా తిరుగుతూ భూ రికార్డుల ప్ర క్షాళనను ముమ్మంగా కొనసాగిస్తున్నారు. రైతుల నుంచి సమస్యలను, వివరాలను రాత పూర్వకంగా తీసుకుని వాటిని తమ రికార్డులతో సరిపోల్చుకుంటున్నారు. ఆ తరువాత చట్టబద్ధం గా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రతి రోజు ఏ గ్రామంలో ఎన్ని సమస్యలు పరిష్కరిం చారు? ఏ తరహా సమస్యలు ఉన్నాయి? అనేది ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. రైతుల వారసత్వ హక్కులు, పట్టాదా రు పుస్తకాలలో మార్పులు, చేర్పుల వంటి పక్రియకు సంబంధించి సమాచారం తీసుకుని నమోదు చేస్తున్నారు. చట్టపరమైన అభ్యంతరాలు, ప్రభుత్వ భూ ములు, అసైన్డ్‌ భూముల లావాదేవీలవంటివి తలెత్తితే వాటిని సైతం సేకరించుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. 

తొలగుతున్న చిక్కులు 
భూముల సమస్యలను తొలగించేలా రెవెన్యూ అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. సమస్యలున్న సర్వే నంబర్లను రైతులు ఆ న్‌లైన్‌లో ఫామ్‌(1)బి తీసుకుని పాస్‌బుక్‌ జిరాక్స్‌ను జతచేసి సర్వే అధికారులకు అందిస్తున్నారు. భూ సమస్యలను అధికారులు రెండు రకాలుగా విభజించారు. మొదటగా ఎలాంటి వివాదాలు లేని వాటిని పరిష్కరిస్తూ నమోదు చేస్తున్నారు. సర్వేలో తప్పిదాలు చోటుచేసుకోకుండా ఉండేందు కు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ముందుగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఎలాంటి వివాదాలు లేనివాటికే ప్రాధాన్యం కల్పించారు. సమగ్ర భూసర్వే లో పలు రకాల సమస్యలు బహిర్గతమవుతున్నాయి. 

రైతుకుల అవగాహన
కలెక్టర్‌ భారతీహోళికేరి, జాయింట్‌ కలెక్టర్‌ సురేష్‌బాబు, ఇతర రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ భూ రికార్డుల ప్రక్షాళన మీద రైతులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లినప్పడు రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తేవ డం, వాటి పరిష్కారం సులభతరం అవుతున్నాయి. రైతులు తమకు ఎప్పటికప్పుడు సహకరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 

40 శాతం అస్పష్టతగా గుర్తింపు 
ఇప్పటి వరకు జరిగిన సర్వేను పరిశీలిస్తే స్పష్టత లేని సమస్యలు సుమారు 40 శాతం వరకు ఉన్నాయని తెలుస్తోంది. రైతుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా భూముల వివరాలను నవీకరిస్తున్నారు. ఒకే సర్వే నంబర్లో విస్తీర్ణంలో వ్యత్యాసం, వారసత్వ వివాదాలు, భూతగాదాలు హ ద్దుల సమస్యలు అన్నదమ్ముల మధ్య ఘర్షణలతోపాటు, అమ్మడానికి వీల్లేని అసైన్డ్‌ భూముల కొనుగోలు వంటివాటిని మొదటి విడతలో అపరి ష్కృత సమస్యలుగానే నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 99,078 సర్వే నంబర్లను పరిశీలించగా ఇందులో 68,925 సర్వే నంబ ర్లు సరిగ్గా ఉన్నవిగా తేలింది. 30,148 సర్వే నంబర్లను సమస్యలున్నవిగా గుర్తించారు. వీటిని పార్టు(బి)గా తీసుకుని వివాదాలను పరిష్కరిస్తామ ని అధికారులు చెబుతున్నారు. 

తేలుతున్న ప్రభుత్వ భూముల లెక్క...
ఇప్పటికే ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూమి ఎంతుందో అధికారుల వద్ద సమాచారం ఉండటంతో భూ రికార్డుల ప్రక్షాళన సజావుగా సాగుతోంది. ప్రభుత్వ భూమి ఎంత ఉందనే వివరాలను పక్కాగా సేకరిస్తున్నారు. అది ఏ రూపంలో ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేస్తున్నారు. ర హదారులకు, ఇతర ప్రయోజనాలకు, చెరువులు, కుంటల రూపంలో ఉన్న భూమి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూమి ఎవరి ఆధీనంలో ఉంది. చేతులు మారిన తీరు వంటి అంశాలను సైతం సేకరించి నివేదికలో పొందుపరుస్తున్నారు. ఖాళీగా ఉ న్న ప్రభుత్వ భూములు ఖబ్జాకు గురైన తీరు, వాటి అనుభవదారులు ఎవరు? అనే పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. 

ఆక్రమణదారుల్లో గుబులు 
భూములులేని నిరుపేదల ఉపాధి కోసం ప్రభుత్వం అసైన్డ్‌ భూమిని కేటాయిస్తుంది. ఆ భూముల్లో వారే పంటలు సాగు చేస్తూ జీవనం కొనసా గించాలి. స్థానికులకే భూమిని అప్పగిస్తారు. ఆయా భూముల క్రయవిక్రయాలు చెల్లవు. జిల్లాలో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి.  ఎవ రికి ఎన్ని అసైన్డ్‌ భూములు ఇచ్చారు. ఇచ్చిన భూముల్లో వారే ఉన్నారా? లేక ఇతరులకు అమ్మేశారా! ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు ఎన్ని? తదితర వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆక్రమణదారుల్లో గుబులు పుడుతోంది. 

పెండింగ్‌ సమస్యలు పరిష్కారం...
ఇక రైతులకు ఎప్పట నుంచో పెండింగ్‌లో ఉన్న పాస్‌ పుస్తకాల మ్యూటేషన్, రికార్డుల్లో పేర్లు తప్పుగా నమోదు కావ డం వంటి సమస్యలకు తక్షణ పరిష్కారం లభించేలా రికార్డులను సరి చేస్తున్నారు. ఏళ్ల నాటి తప్పులకు వెనువెంటనే పరి ష్కారం లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత 70 గ్రామాల్లో ప్రక్షాళన పూర్తి అయింది

పారదర్శకంగా ప్రక్షాళన 
జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళనకు అనూహ్య స్పందన లభిస్తోంది. రైతులు రికార్డుల పరంగా ఎదుర్కుంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీ సుకొచ్చి పరిష్కరించుకుంటున్నారు. ఇప్పటికే 70 గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశాం. రైతులు ముందుకొచ్చి వివరాలను   చెబుతున్నా రు. నిర్ణీత గడువు డిసెంబరులోగా భూ ప్రక్షాళనను పూర్తి చేస్తాం.  
 –సురేష్‌బాబు, జాయింట్‌ కలెక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement