నీతో ఏకాంతంగా ఉన్న ఆ ఇద్దరు మహిళలు ఎవరు? అంటూ హత్య | Four Accused Surrender to Police Following Killing | Sakshi
Sakshi News home page

నీతో ఏకాంతంగా ఉన్న ఆ ఇద్దరు మహిళలు ఎవరు? అంటూ హత్య

Jun 7 2026 7:59 PM | Updated on Jun 7 2026 8:05 PM

Four Accused Surrender to Police Following Killing

మెదక్: వివాహేతర సంబంధం మరో వ్యక్తి ప్రాణాలు తీసింది. భార్య కళ్లుగప్పి మరో ఇద్దరు మహిళలతో సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. ఆ విషయాన్ని గుర్తించిన భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. తన తల్లిదండ్రులు, సోదరుడి సాయంతో భర్తను అక్కడికక్కడే చంపేసింది. 

మెదక్‌, మిలిటరీ కాలనీలో ఓ ఆర్మీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం కారణంగా పొన్నం కుమార్‌ను అతడి భార్య, అత్త, మామ, బావమరిది హత్య హత్యచేశారు. ఇంట్లో ఇద్దరు మహిళలతో పొన్నం కుమార్‌ ఏకాంతంగా ఉండగా అతడి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 

ఆ ఇద్దరు మహిళలు ఎవరంటూ ఆగ్రహంతో పొన్నం కుమార్‌ను హత్య చేసి, అనంతరం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిందితులు నలుగురు లొంగిపోయారు. ఉత్తరాఖండ్‌లో ఆర్మీ ఉద్యోగిగా పని చేస్తున్న కుమార్.. ప్రస్తుతం సెలవులు ఉండడంతో ఇంటికి వచ్చాడు. ఈ నెల 10న విధులకు తిరిగి వెళ్లాల్సి ఉండగా హత్యకు గుర‍య్యాడు. 

Advertisement
 
Advertisement
Advertisement