మార్పునకు ముందడుగు: కేటీఆర్‌ | KTR Comments On Cities | Sakshi
Sakshi News home page

మార్పునకు ముందడుగు: కేటీఆర్‌

Mar 7 2020 2:44 AM | Updated on Mar 7 2020 2:44 AM

KTR Comments On Cities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన తొలి విడత పట్టణ ప్రగతి విజయవంతమైందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. పట్టణాల్లో గుణాత్మక మార్పునకు తొలి అడుగుగా భావిస్తున్నామని, మార్పుదిశగా ఒక ముందడుగు పడిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. అది ముగిసిన అనంతరం పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో శుక్రవారం ఆయన జిల్లా అదనపు కలెక్టర్లతో సమావేశమై పట్టణ ప్రగతి కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. 

Advertisement
 
Advertisement
Advertisement