బతికించండి!

Kidneys Failure Women Waiting For helping Hands - Sakshi

రెండేళ్ల క్రితమే రెండు కిడ్నీలు ఫెయిల్‌  

ప్రస్తుతం ‘ఫిస్టుల’ సైతం  

సాయం కోసం ఓ మహిళ ఎదురుచూపు  

హిమాయత్‌నగర్‌: రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. దీంతో భర్త వదిలేశాడు. డయాలసిస్‌ చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ‘పెర్మ్‌క్యాత్‌’ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇది చేయని పక్షంలో డయాలసిస్‌ చేయడం కష్టమవుతుంది. డయాలసిస్‌ చేయకపోతే మనిషి బతికే చాన్స్‌ లేదంటూ వైద్యులు తెలిపారు. ఇదీ కేతావత్‌ కస్తూరి నాయక్‌ దీనగాథ. ఈ సమయంలో ఆమె దాతల కోసం ఎదురుచూస్తోంది. ఆదుకోవాలని అభ్యర్థిస్తోంది. బాలానగర్‌కు చెందిన కేతావత్‌ కస్తూరి నాయక్‌(37)కు రెండేళ్ల క్రితం కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. అప్పటికే కస్తూరికి ఇద్దరు పిల్లలు కూడా ఉండగా... భర్త వదిలేసి వెళ్లిపోయాడు. పుట్టింటికి వెళ్దామంటే.. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ‘వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఫర్‌ కిడ్నీ పేరెంట్స్‌’ ఫౌండర్, ప్రెసిడెంట్‌ ఐ.మమతను ఆమె ఆశ్రయించింది. కస్తూరిని వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంచి ప్రతి నెలా వీరే డబ్బులు చెల్లిస్తున్నారు. అలాగే రెండేళ్లుగా అసోసియేషన్‌ ద్వారా డయాలసిస్‌ చేయిస్తున్నారు.   

రూ.2 లక్షలు అవసరం..  
కస్తూరి నాయక్‌ శరీరంలో ‘ఫిస్టుల’ ఫెయిలైంది. దీంతో ఇప్పుడు ‘వాస్కులర్‌ సర్జన్‌’ ద్వారా ‘పెర్మ్‌క్యాత్‌’ చేయాల్సి ఉంది. దీనికి గాను రూ.లక్ష పైన అవసరం. ఈ చికిత్స చేసిన తర్వాత మందుల కోసం, తాను ఉండేందుకు గాను మొత్తం రూ.2లక్షల వరకు అవసరం కానుంది. దాతలు స్పందించి తనకు సాయం చేస్తే అందరిలాగే తన పిల్లలతో ఆనందంగా ఉంటానంటోంది కస్తూరి నాయక్‌.  

దాతలు సాయం చేయాలనుకుంటే..
బ్యాంకు వివరాలు  
పేరు: కేతావత్‌ కస్తూరి నాయక్‌
అకౌంట్‌ నంబర్‌: 0670101029026
బ్యాంకు: కెనరా బ్యాంక్‌
బ్రాంచి: ఉప్పల్‌ బ్రాంచ్‌
ఐఎఫ్‌సీ కోడ్‌: సీఎన్‌ఆర్‌బీ0000670
ఫోన్‌: 95055 90393,79950 56739, 94402 18174

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top