18న ఖైరతాబాద్‌ మహాగణపతి కర్రపూజ | Khairathabad Ganesh Starting Pooja on 18th May Hyderabad | Sakshi
Sakshi News home page

18న ఖైరతాబాద్‌ మహాగణపతి కర్రపూజ

May 12 2020 7:52 AM | Updated on May 12 2020 7:52 AM

Khairathabad Ganesh Starting Pooja on 18th May Hyderabad - Sakshi

ఖైరతాబాద్‌: ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవాలను 66వ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు కర్ర పూజ నిర్వహించి ప్రారంభించే పనులను ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కర్రపూజలో పాల్గొనే వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షులు సింగరి సుదర్శన్‌  అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వినాయకుడి తయారీ, ఎత్తు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంపై పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement