'కేబినెట్‌లో టీఆర్‌ఎస్‌కు నో ఛాన్స్‌' | K Laxman Fires on TRS Government | Sakshi
Sakshi News home page

'కేబినెట్‌లో టీఆర్‌ఎస్‌కు నో ఛాన్స్‌'

Sep 2 2017 11:42 AM | Updated on Sep 17 2017 6:18 PM

'కేబినెట్‌లో టీఆర్‌ఎస్‌కు నో ఛాన్స్‌'

'కేబినెట్‌లో టీఆర్‌ఎస్‌కు నో ఛాన్స్‌'

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్‌ చేశారు.

సాక్షి, యాదాద్రి: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్‌ చేశారు. శనివారం భువనగిరిలో విమోచన దినోత్సవ యాత్రను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నయా నిజాం చేతిలో తెలంగాణ నయవంచనకు గురవుతోందన్నారు. రజాకార్ల వారసులైన మజ్లిస్‌ను ప్రభుత్వం అక్కున చేర్చుకుంటోందన్నారు. టీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని, కేంద్ర మంత్రివర్గంలో టీఆర్ఎస్ అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఈనెల17న నిజామాబాద్‌లో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచి అయినా సెప్టెంబర్‌ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహింపజేస్తామన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకుంటే 2019లో తాము అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తామన్నారు. భువనగిరిలో ప్రారంభమైన యాత్ర పరకాలకు చేరుకుంటుందని లక్ష్మణ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement