కన్నీళ్లతో ఇంటర్‌ పరీక్షకు ..  | Inter exams with tears | Sakshi
Sakshi News home page

కన్నీళ్లతో ఇంటర్‌ పరీక్షకు .. 

Mar 4 2018 3:37 AM | Updated on Mar 4 2018 3:37 AM

Inter exams with tears - Sakshi

డిచ్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డిచ్‌పల్లి తండాకు చెందిన రాథోడ్‌ శ్రీనివాస్‌ (38) మృతదేహం గల్ఫ్‌లోని సౌదీ అరేబియా నుంచి శనివారం ఉదయం ఇంటికి చేరుకుంది. శ్రీనివాస్‌ కూతురు మమత ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాస్తోంది. శనివారం ఇంటికి చేరుకున్న తండ్రి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయింది. కుటుంబ సభ్యులు, బంధువులు నచ్చజెప్పగా ఉదయం 9 గంటలకు జరిగిన ఇంటర్‌ పరీక్షకు హాజరైంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసి వెంటనే ఇంటికి చేరుకుంది. అనంతరం ఇంటికి చేరుకుని తండ్రి అంత్యక్రియలకు హాజరైంది. 

Advertisement
 
Advertisement
Advertisement